ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఐ బొమ్మ రవి పేరే వినిపిస్తుంది. మారుమూల పల్లెటూర్లలో కూడా రవి పేరు మార్మోగిపోతుంది. పోలీసులు, సినీ ఇండస్ట్రీ చీటర్, హ్యాకర్ అంటున్నా సరే సామాన్య జనాలు మాత్రం మా హీరో అంటున్నారు. ఇంతకీ ఐ బొమ్మ రవి ఇంత భారీ మద్దతు ఎలా కూడగట్టాడు అనేదే ఇక్కడ అందరికీ వస్తున్న ప్రశ్న. దానికి కారణం కూడా సినిమా ఇండస్ట్రీ అనే చెప్పాలి. అవును సినిమా వాళ్లు చేస్తున్న పనుల వల్లే ఐ బొమ్మ రవి సామాన్యుల హీరో అయ్యాడు.
సింగిల్ థియేటర్ల ప్లేస్ లో మల్టీప్లెక్స్ లు వచ్చి పడ్డాయి. టికెట్ కౌంటర్ క్లోజ్ అయి బుక్ మై షో లాంటివి వచ్చేసాయి. ప్రతి సినిమాకు విపరీతంగా టికెట్ రేట్లు పెంచేసి అమ్ముకుంటున్నారు. పైగా ప్రభుత్వాలు స్పెషల్ జీవోలు ఇచ్చి మరి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు లాంటివి చేయడం వల్ల సామాన్యులు సినిమా ధియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే పరిస్థితి లేకుండా పోయింది. వీటికి తోడు ఒక ఫ్యామిలీ సినిమా ధియేటర్ కు వెళితే పాప్ కార్న్, సమోసాలు, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్ లాంటివి బయట దొరికే రేట్ల కంటే 20 రేట్లు ఎక్కువగా పెంచేసి అమ్మడంతో సామాన్యుల జేబుకు చిల్లు పడుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో సినిమాలను విపరీతంగా ఇష్టపడే జనాలు ఎక్కువ.
సినిమాలు చూడాలనే ఆశ ఉన్నా సరే కుటుంబాన్ని తీసుకొని వెళ్లి చూడగలిగే పరిస్థితులు లేకపోవడంతో సామాన్యులు అందరూ కూడా ఐ బొమ్మను ఎంచుకున్నారు. వేలు పెడితే గాని సినిమా చూడలేని వాళ్లకు ఉచితంగా ఐ బొమ్మలో సినిమాలు చూసే అవకాశం రావడం వల్ల థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవాళ్ళు చాలా తగ్గిపోయారు. క్రమక్రమంగా ఇది పెరిగి థియేటర్లకు వెళ్లే వాళ్ళ సంఖ్య భారీగా తగ్గిపోయి ఐ బొమ్మకు విపరీతంగా క్రేజ్ పెరిగింది. థియేటర్లలో లక్ష మంది చూస్తే ఐ బొమ్మలో 50 లక్షల మంది చూసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఐ బొమ్మ రవిని అరెస్టు చేయటంతో ఉచితంగా సినిమాలు చూసే అవకాశం లేకుండా పోయింది. అందుకే సామాన్య జనాలు అందరూ కూడా ఇప్పుడు ఐ బొమ్మ రవికి ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు బయటకు రావాలని కోరుకుంటున్నారు. మరి ఐ బొమ్మ రవి బయటకు వస్తాడా లేదా అనేది చూడాలి.