రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన మూవీ ‘కింగ్ డమ్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా, సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేయాలనుకున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. కొత్త రిలీజ్ డేట్ గా జూలై 4 అని అనౌన్స్ చేశారు నిజానికి ఈ మూవీ మే 30న ఖచ్చితంగా వస్తుందనే భావించారు చాలామంది. కానీ ఏకంగా నెల రోజులకు పైగా వాయిదా వేయడం అభిమానులను నిరాశపరుస్తోంది.
కంటెంట్ పరంగా చూస్తే ఇందులో హై ఎమోషన్స్ ఉంటాయని రీసెంట్ గా వచ్చిన పాటతో పాటు టీజర్ చూస్తే తెలుస్తుంది. పైగా ఈ మూవీని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఈ కింగ్ డమ్ ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే ముందు ఈ పార్ట్ వాయిదా పడటం ఫ్యాన్స్ కు నచ్చలేదు.
అయితే ఈ మూవీని ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలనుకున్నారు. ఆ కారణంగానే దేశ పరిస్థితులు బాలేవు అంటున్నారు. ఇక జూన్ లో రిలీజ్ చేయాలనుకుంటే.. జూన్ లో థగ్ లైఫ్, కుబేర, హరిహర వీరమల్లు వంటి చిత్రాలు ఉన్నాయి. అందుకే జూలై 4న విడుదల చేయబోతున్నా అని ప్రకటించారు. మరి ఆ డేట్ కు అయినా వస్తారా లేక ఇంకేవైనా మార్పులుంటాయా అనేది చూడాలి.