డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం మొదలుపెట్టినట్టేనా..? ఈ మూవీ అఖండ విజయం సాధించేనా..? ప్యాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటేనా..? ఇదీ అఖండ 2 విజయం గురించిన ప్రశ్నలు. ఈ మూవీ విడుదల కావడానికి ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. ఈ లోగా ఆ స్థాయిలో మోత మోగుతుందా అంటే ఖచ్చితంగా మోగుతుంది అని చెబుతున్నారు. ఫస్ట్ పార్ట్ లో డ్యూయొల్ రోల్ లో నటించాడు బాలయ్య. ఒక పాత్రలో రెగ్యులర్ వ్యక్తిగా కనిపిస్తాడు. మరో పాత్రలో అఘోరాగా కనిపించాడు. ఆ పాత్రలో చిన్నతనం అమ్మాయి లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చెప్పాడు. మరి ఈ పార్ట్ లో ఎలాంటి సంఘటనలే జరగబోతున్నాయి.. అనేది చూపిస్తాడా అనేది తెలియాల్సి ఉంది.
అఖండ 2 ట్రైలర్ బాలయ్య రేంజ్ లోనే ఉంది. కాకపోతే కాస్త బోయపాటి శైలిలో కాస్త ఓవర్ యాక్షన్ అనిపించేలా కనిపిస్తున్నాడు. ఓవర్ యాక్షన్ ప్లస్ అవుతుంది అనిపించేలా ఉంది. బాలయ్య ఇమేజ్, బోయపాటి టేకింగ్ ఈ రెండూ మిక్స్ అయి ఉంటే మాత్రం బాలయ్య బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది. మరోసారి అఘోరిలా కనిపిస్తాడు బాలయ్య. ఈ ఈసారి కూడా ఆ అమ్మాయినే రక్షించబోతున్నాడు అనిపించేలా ఉన్నాడు. ఇక ఆది పినిశెట్టి లుక్ మాత్రం అదిరిపోయింది. అతని నటన కూడా హైలెట్ అవుతుందని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు అనిపించేలా ఉన్నాడు. బాలయ్య వర్సెస్ ఆది పినిశెట్టి అనేది మూవీలో హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది.
బాలయ్య ఈ ఏజ్ లో ప్యాన్ ఇండియా రేంజ్ లో మూవీ కనిపించబోతున్నాడు. అందుకు తగ్గట్టుగా మూవీని కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ చేయాల్సి ఉంది. ట్రైలర్ ఆల్రెడీ కర్ణాటకలో రిలీజ్ చేశారు. ఆల్రెడీ హిందీ నుంచి ఓ పాట కూడా విడుదల చేశారు. మొత్తంగా పది రోజుల్లో ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ తో మెప్పించాల్సి ఉంది. అప్పుడే అఖండ 2 అఖండ విజయం సాధించింది అన్నమాట.