నేచురల్ స్టార్ ను వయొలెంట్ స్టార్ గా చూడటానికి మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. ఇన్నాళ్లూ మనం నేచురల్ అనుకుని మోస పోయాం అని.. తన ఒరిజినల్ ఏంటో చూపిస్తా అని టీజర్ లోనే చెప్పాడు నాని. హిట్ 3తో బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయం అంటూ కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. మరికొన్ని గంటల్లోనే హిట్ 3 ఆడియన్స్ ముందుకు రాబోతోంది.నానియే నిర్మించిన ఈ చిత్రాన్ని ఫ్రాంఛైజీ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేశాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇలాంటి సినిమాలకు భిన్నంగా కనిపించే మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. అడివి శేష్, కార్తీ కేమియో రోల్స్ లో నటించారు అని చెప్పారు.
మొత్తంగా నాని ఈ మూవీతో తన కెరీర్ కు సంబంధించిన ఓ స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాడు అనే సంకేతాలైతే కనిపిస్తున్నాయి. ప్రమోషన్స్ పరంగా చూస్తే ఇంతకు ముందెప్పుడూ లేనంత కాన్ఫిడెన్స్ తో ప్రమోట్ చేశాడు. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అనే నమ్మకం అతనిలో స్పష్టంగా కనిపించింది. ఇంత వయొలెన్స్ ఉన్న సినిమా తెలుగు ఇండస్ట్రీలోనే ఇప్పటి వరకూ రాలేదు అంటున్నాడు. బాలీవుడ్ లో కిల్, మళయాలంలో మార్కో, తెలుగులో హిట్ 3 అని క్లియర్ గా చెబుతున్నాడు. తన ఇమేజ్ కు పూర్తి భిన్నమైన కంటెంట్ ఇది.
విశేషం ఏంటంటే నాని ఇమేజ్ తో పనిలేకుండా ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగానే అవుతున్నాయి. ఓవర్శీస్ లో సైతం ఓ రేంజ్ లో స్పందన వస్తోంది. హిట్ 3తో నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ చూడబోతున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. మరి అది నిజం అవుతుందా లేదాఅనేది చూడాలి. ఒకవేళ ఓపెనింగ్స్ తో పాటు మంచి మౌత్ టాక్ కూడా ఉంటే.. ఈ సమ్మర్ లో టాలీవుడ్ కూ ఓ పెద్ద రిలీఫ్ అవుతుందని చెప్పొచ్చు.