బాలయ్య వేడుకలకు ఎన్టీఆర్ ను పిలుస్తారా..

Update: 2024-07-27 10:20 GMT

ఎవరు అవునన్నా కాదన్న.. కొన్నాళ్లుగా ఎన్టీఆర్ వర్సెస్ నందమూరి ఫ్యామిలీ అనే వార్ నడుస్తోంది. ఆ కుటుంబానికి అవసరమైన టైమ్ లో ఎన్టీఆర్ ప్రాపర్ గా రియాక్ట్ కాలేదు అనేది ఒక కారణం అయితే.. తాత శత జయంతికి వెళ్లలేదు అనేది మరో కారణం. అందుకే నందమూరి ఫ్యామిలీ జూనియర్ ను కాస్త దూరంగానే ఉంచుతోంది. ఏపి ఎన్నికల్లో టిడిపి గెలిచిన తర్వాత చంద్రబాబు మామయ్య, బాలా బాబాయ్ అంటూ వరసలు కలిపినా.. అంతకు ముందు ఆ వరసలను పట్టించుకోలేదనే కోపంతో ఉంది నందమూరి కుటుంబం. అందుకే సెప్టెంబర్ 1న అత్యంత గ్రాండ్ గా జరగబోతోన్న నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ సంబరాలకు ఎన్టీఆర్ తో పాటు ఆయన అన్న కళ్యాణ్ రామ్ ను ఆహ్వానిస్తారా లేదా అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.

ఈ నెల 30కి బాలయ్య నటించిన తొలి సినిమా తాతమ్మ కల విడుదలై 50 యేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ లోనే ఓ భారీ ఫంక్షన్ ఏర్పాటు చేశారు అభిమానులు., ఈ వేడుకకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులతో పాటు నందమూరి కుటుంబం అంతా హాజరవుతుంది. ఓ రకంగా ఇది కీలకమైన వేడుక అనే చెప్పాలి. మరి ఈ వేడుకకు తారక్ ను పిలుస్తారా.. పిలిస్తే అతను వస్తాడా అనే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి.

గతంలో పెద్దాయన శతజయంతి వేడుకలకు ఆహ్వానం ఇచ్చినా రాలేదు అని తారక్ ను అంటారు కొందరు. ఇన్విటేషన్ రాలేదు అని ఇటు వైపు సన్నిహితుల నుంచి సమాచారం ఉంది. మొత్తంగా ఈ బాలయ్య వేడుకలకు ఎన్టీఆర్ కు ఇన్విటేషన్ లేకపోతే ఇక ఆ ఫ్యామిలీ ఆయన్ని వదిలేసుకున్నట్టుగానే భావించాలి. అది ఎన్టీఆర్ కెరీర్ పైనా ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ ఆహ్వానం వచ్చి అతను వెళితే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయినట్టే. అదే వేదిక నుంచి పార్టీ శ్రేణులకు కూడా ‘‘మనోడే’’అనే సంకేతాలు వెళతాయి. అప్పుడూ ఎన్టీఆర్ కెరీర్ కు ప్లస్ అవుతుంది. మరి సెప్టెంబర్ 1న ఏం జరుగుతుందో చూద్దాం.

Tags:    

Similar News