Ram Charan Peddi : పెద్ది పోస్ట్ పోన్ అవుతుందా..?

Update: 2026-01-22 10:32 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మూవీ పెద్ది. బుచ్చిబాబు సనా దర్శకత్వం చేస్తున్నాడు. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ కథ పట్ల దర్శకుడు చేస్తోన్న వర్క్ పై చాలా చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ చేసిన ఆచార్య అనుకున్నంతగా ఆకట్టుకోలేదు. తర్వాత చేసిన గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అయింది. అందుకే పెద్దిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ మూవీ మార్చి 27న విడుదల కాబోతుంది అని ముందు నుంచీ చెబుతున్నారు. బట్ తాజాగా మాత్రం ఈ మూవీ రిలీజ్ డేట్ మారబోతోంది అనిపిస్తోంది.

పెద్ది మూవీ షూటింగ్ ఇన్ టైమ్ లో పూర్తి చేయబోతున్నారు. ఈ విషయంలో దర్శకుడు బుచ్చిబాబు చాలా క్లారిటీతో ఉన్నాడు. మరి రిలీజ్ డేట్ మార్చడానికి కారణం ఏంటీ అనిపిస్తుంది కదా. చాలా మంది ఆ మూవీ రిలీజ్ డేట్ కంటే ముందుగా అనౌన్స్ చేసిన నాని ద ప్యారడైజ్ మూవీ కారణం అని చెబుతున్నారు. బట్ కాదు. ఈ మూవీ పోస్ట్ పోన్ కు నేషనల్ ఇష్యూస్ ఉన్నాయి.

పెద్ది రిలీజ్ డేట్ కంటే ముందుగా రెండు భారీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అందులో ఒకటి యశ్ హీరోగా నటించిన టాక్సిక్. టాక్సిక్ పై కూడా భారీ అంచనాలున్నాయి. మరి యశ్ వల్ల రామ్ చరణ్ మూవీ ఇబ్బంది పడటం ఏంటీ అనుకుంటున్నారా.. కాదు. దీంతో పాటు విడుదల కాబోతున్న దురంధర్ మూవీ కూడా ఉంది. అంటే మార్చి 19న టాక్సిక్ తో పాటు దురంధర్ 2 కూడా ఉన్నాయి. ఆ తర్వాతి వారం పెద్ది మూవీ రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ టాక్సిక్, దురంధర్ 2తో థియేటర్స్ తో ప్రాబ్లమ్ ఉంది. ఆ సమస్యకు పెద్ది కూడా తోడవడం తప్పు కాదు. కానీ.. ఆ రెండు సినిమాల నేషనల్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ కారణంగా పెద్దికి ప్రాబ్లమ్ రావొచ్చు అంటున్నారు. ఆ రెండు సినిమాల బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ తో పాటు పెద్ది మూవీ డిస్ట్రిబ్యూటర్ కూడా ఒక్కడే ఇక్కడ అసలు కారణం. మామూలుగా అయితే పెద్దిని కూడా పోటీలో నిలబెట్టొచ్చు. కానీ ఈ డిస్ట్రిబ్యూటర్ రామ్ చరణ్ కు చాలామంచి స్నేహితుడు. ఆ కారణంగా పెద్ది వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తుంది. ఇది దాదాపు ఖరారయింది అంటున్నారు. మరి ఇది నిజమా కాదా అనేది తేలాల్సి ఉంది. 

Tags:    

Similar News