Actor Ruksar Dhillon : రుక్సార్ కు లక్ కలిసొచ్చేనా?

Update: 2025-02-20 06:30 GMT

అశోకవనంలో అర్జున కల్యాణం, ఏబీసీడీ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన బ్యూటీ రుక్సార్ ధిల్లాన్. న్యాచురల్ స్టార్ నానితో కృష్ణార్జున యుద్ధం మూవీలో గ్లామర్తో అలరించిన ఈ అమ్మడు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఐతే అందం, అభినయం ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం కలిసిరాలేదు ఈముద్దుగుమ్మకు. కెరీర్ లో సరైన కథల ఎంపిక చేసుకోలేని గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. సినిమాల్లో ఛాన్స్ వస్తే చాలు అనుకున్న పరిస్థితికి ఈభామ పడిపోయింది. ఒక వైపు సినిమాలు లేకపోయినా తన ఫొటో షూట్స్ తో ఫాలోవర్స్ కి కిక్ ఎక్కించేస్తుంది అమ్మడు. మరోవైపు కెరీర్ డౌన్ ఫాల్అవుతున్న తరుణంలో తాజాగా కిరణ్ అబ్బవరం జోడిగా దిల్రుబాలో హీరోయిన్గా నటిస్తోంది రుక్సార్. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా టీజర్ ఇంప్రెస్ చేసింది. హోలీ సందర్భంగా మార్చి 14న సినిమా విడుదల కానుంది. కెరీర్ దాదాపు ముగిసింది అనుకున్న టైంలో హిట్ సినిమా కొట్టిన హీరో పక్కన ఛాన్స్ అందుకున్న థిల్లాన్.. దిల్ రూబాతో అయినా లక్ కలిసొచ్చి సక్సెస్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News