Vijay Goat : విజయ్ ని ఆ కారణంగా ఇబ్బంది పెడతారా

Update: 2024-08-20 05:19 GMT

తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ 'గోట్'. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేది ఫుల్ ఫామ్. లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కనిపించింది. విజయ్ రీసెంట్ గా పొలిటికల్ పార్టీ పెట్టాడు. ఈ మూవీ తర్వాత మరో సినిమా చేసి.. ఆపై పూర్తిగా రాజకీయాలకే టైమ్ ఇవ్వబోతున్నాడు. ఓ రకంగా సినిమాలకు ఇక రిటైర్మెంట్ ప్రకటించినట్టే అనుకోవచ్చు.

విజయ్ గోట్ మూవీపై ఎప్పట్లానే తమిళ్ లో కొంతమంది యాంటి ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్లంతా అజిత్ ఫ్యాన్స్ అయి ఉంటారు అనేది ఓపెన్ మేటర్. అయితే ప్రస్తుతం తెలుగులో కూడా విజయ్ పై కొంత ట్రోలింగ్ నడుస్తోంది. ఇంతకు ముందు ఇది లేదు. అయినా ఇప్పుడే ఎందుకు అంటే.. రీసెంట్ గా కీర్తి సురేష్ ఒక ఇంటర్య్యూ లో చిరంజీవి కంటే విజయ్ బెస్ట్ డ్యాన్సర్ అని చెప్పింది. దీంతో విజయ్ పాత డ్యాన్స్ మూమెంట్స్ ను బయటకు తీసి మెగాస్టార్ డ్యాన్స్ తో కంపేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. నిజానికి ఇలా చేయడం ఏమంత సరైన పని కాదు అని మినిమం సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది.

చిరంజీవి కంటే విజయ్ బెస్ట్ డ్యాన్సర్ అనేది కీర్తి సురేష్ అభిప్రాయం. దానికి విజయ్ కి ఏ సంబంధమూ లేదు. అదీ కాక సినిమాలపై మినిమం అవగాహన ఎవరికైనా సరే డ్యాన్స్ లో మెగాస్టార్ ను బీట్ చేసేవాళ్లు సౌత్ లోనే లేరు అనే విషయం తెలుసు. ఆయనకంటే ఎక్కువ మూమెంట్స్ చేస్తూ ఉండొచ్చేమో.. కానీ మెగాస్టార్ గ్రేస్ ను ఆయన తనయుడు కూడా అందుకోలేకపోయాడు. అలాంటప్పుడు కేవలం కీర్తి సురేష్ ఒపీనియన్ ను పట్టుకుని విజయ్ సినిమాను డ్యామేజ్ చేయడం తెలివైన పనైతే కాదు.

Tags:    

Similar News