War 2 : వార్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ లో రికార్డ్ సృష్టిస్తుందా..?

Update: 2025-08-12 11:18 GMT

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2 మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై వర్స్ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను అందుకోవడం ఖాయం అనేలా కనిపిస్తోంది మూవీ టీమ్ కాన్ఫిడెన్స్. నార్త్ మొత్తం హృతిక్ రోషన్ క్రేజ్, ఇమేజ్ ప్లస్ అవుతుంది. అలాగే అక్కడ ఎన్టీఆర్ కూ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక సౌత్ లో ముఖ్యంగా తెలుగులో ఎన్టీఆర్ కు తిరుగులేని క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ సోలోగానే ఇప్పటికే వంద కోట్ల ఓపెనింగ్స్ తెచ్చుకుంటున్నాడు. సో.. ఇప్పుడు మరో హీరో కూడా యాడ్ అయ్యాడు కాబట్టి.. ఈ మూవీ సులువుగా 150 కోట్లకు పైగానే ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించొచ్చు అని అంచనాలు వేస్తున్నారు. అటు ఓవర్శీస్ లో కూడా మూవీపై అంచనాలున్నాయి. అందుకే ఒకవేళ 200 కోట్ల మార్క్ ను టచ్ అయినా ఆశ్చర్యం లేదు అంటున్నారు ట్రేడ్ అనలిస్ట్ లు. ఈ మార్క్ రావాలంటే ఖచ్చితంగా మొదటి ఆటకే బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. ఆ మౌత్ టాక్ చాలు.. నెక్ట్స్ షో నుంచే అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అయిపోవడానికి.

ఇక ఇండియన్ స్పై ఏజెంట్స్ కు సంబంధించిన కథలతో మాత్రమే ఈ మూవీస్ రూపొందిస్తోంది యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్. ఆ క్రమంలో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, వార్ 2 వంటి మూవీస్ వస్తున్నాయి. ఈ సిరీస్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుందని గతంలోనే ప్రకటించింది బ్యానర్. సో.. ఈ సిరీస్ లో నెక్ట్స్ మూవీస్ లో కూడా ఎన్టీఆర్ కనిపించే అవకాశాలున్నాయి. ఈ వార్ 2ను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశాడు. కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ గా హృతిక్ జోడీగా కనిపించబోతోంది. అయితే తను కూడా ఓ స్పై కావడం విశేషం. మొత్తంగా వార్ 2 ఓపెనింగ్ డే రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధిస్తుందనే అంచనాలున్నాయి.

Tags:    

Similar News