వింక్ బ్యూటీగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యిన మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్. 'ఓరు ఆధార్ లవ్' తో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ చిత్రంలో స్కూల్ అమ్మాయిగా కనిపించిన ఆమె ఓ సీన్ లో కన్ను గీటుతూ కుర్రకారు మనసులు దోచేసింది. ఈ దెబ్బతో ప్రియా ప్రకాశ్ వారియర్ ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఆ తర్వాత ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఒక్క మలయాళంలోనే కాదు తెలుగు, తమిళం నుంచి కూడా పిలుపువచ్చింది. ఈ క్రమంలో నితిన్ జోడిగా చెక్ టాలీవుడ్ లో సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుం టుంది. ఆ తర్వాత పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన బ్రో సినిమాలో హీరోయిన్ చాన్స్ కొట్టేసింది. ఇటీవలే విడుద లైన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలో ఈ మలయాళ బ్యూటీ నటనకు మంచి పేరొచ్చింది. మరోవైపు సోషల్ మీడియలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది ఈ వింక్ బ్యూటీ. తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ని ఆకట్టుకుంటుంది. తాజాగా చీరకట్టులో ఈ భామ ఫిదా చేసింది. బ్లాక్ ఫ్యాన్సీ చీరలో సముద్రం ఒడ్డున ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందులో ప్రియా తన మెడ సొగసును, నాభి అందాలను ఆరబోస్తూ కుర్రకారులో హీట్ పెంచేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.