Writer Padmabhushan Trailer: రైటర్ పద్మభూషణ్ ట్రైలర్: ఏ క్లీన్ ఎంటర్టైనర్

Writer Padmabhushan Trailer: కలర్ ఫోటో ఫేమ్ సుహాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రైటర్‌ పద్మభూషణ్‌. ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది;

Update: 2023-01-20 11:18 GMT

Writer Padmabhushan Trailer:  కలర్ ఫోటో ఫేమ్ సుహాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రైటర్‌ పద్మభూషణ్‌. ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం రైటర్ పద్మభూషణ్. ఈ చిత్రానికి షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించారు. టీనా శిల్పరాజ్ కథానాయికగా నటించింది. విడుదలకు ముందు మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను ఈ రోజు విడుదల చేశారు.




చిత్ర కథ విజయవాడ నేపథ్యంలో సాగుతుంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సుహాస్‌కు ప్రముఖ రచయిత కావాలనేది కోరిక బలంగా ఉంటుంది. ఎట్టకేలకు ఒక పుస్తకాన్ని రాసి ప్రచురిస్తాడు. కానీ, అది వీక్షకులను ఆకర్షించడంలో ఘోరంగా విఫలమవుతుంది. అయితే అతడి రచనలను ఇష్టపడే ఒక అభిమాని ఉందని తెలుసుకుంటాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. కథలోని మలుపులు కడుపుబ్బా నవ్విస్తాయి అని మేకర్స్ చెబుతున్నారు.

Full View

దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ తన రచనతో ఆకట్టుకున్నాడు. డైలాగ్స్ హాస్యభరితంగా ఉన్నాయి. సుహాస్ టైటిల్ రోల్‌లో చక్కని నటనను కనబరిచాడు. ఇక హీరోయిన్ టీనా, అతడికి సరిజోడిగా ఉంది. ఉల్లాసకరంగా సాగిన ట్రైలర్.. చిత్రంపై క్యూరియాసిటీని పెంచింది. సినిమాలో క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ప్రేక్షకులకు ఒక నమ్మకాన్ని కలిగించింది. సుహాస్ సినిమా కెరీర్‌లో ఇది కూడా ఓ బెస్ట్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. 

Tags:    

Similar News