Rashmika Mandanna : అతను మీకు తెలుసు...లవ్ స్టోరీపై రష్మిక

Update: 2024-11-26 05:36 GMT

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన లవ్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇటీవలే విజయ్ దేవరకొండతో ఆమె ఓ రెస్టారెంట్ లో కనిపించిన విషయం తెలిసిందే. ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇక తాజాగా జరిగిన పుష్ప 2 ఈవెంట్ లో ఆ వార్తలకు బలాన్నిచ్చేలా మరో కామెంట్స్ చేసింది రష్మిక. ఈ ఈవెంట్ లో యాంకర్ రష్మికను లైఫ్ లో మీకు బాగా నచ్చిన వ్యక్తి ఎవరు అని అడగగా దానికి సమాధానంగా రష్మిక మాట్లాడుతు నాకు ఇష్టమైన వ్యక్తి ఎవరో మీకు బాగా తెలుసు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె చెప్పిన వ్యక్తి విజయ్ దేవరకొండనే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రష్మిక నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది.

Tags:    

Similar News