అన్నమయ్య జిల్లాలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న తుఫాన్‌.. నలుగురు మృతి

Update: 2023-06-03 06:21 GMT

అన్నమయ్య- చిత్తూరు జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని తుఫాన్‌ వాహనం వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడిక్కడే నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఆరుగురికి తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను, క్షతగాత్రులను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి తరలించారు. పులిచర్ల మండలం ఎంజీఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. తిరువన్నామలై గిరి ప్రదర్శనకు వెళ్తుండగా ప్రయాణికులు ప్రమాదం బారిన పడ్డారు. మృతులు కర్నాలు జిల్లావాసులుగా గుర్తించారు.

కర్నూలు జిల్లా నంద్యాల నుంచి తిరువన్నామలై గిరి ప్రదక్షణకు వెళుతుండగా.. మార్గం మధ్యలో అన్నమయ్య జిల్లా పీలేరు సమీపంలోని ఎంజీఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో కర్నూలుకు చెందిన ప్రతాపరెడ్డి, శివమ్మ, విమల, మరొకరు ఉన్నారు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో.. మృతులను, క్షతగాత్రులను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిలో ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. చిత్తూరు జిల్లా కల్లూరు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రతినెల పౌర్ణమికి రాయలసీమ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షణ నిమిత్తం తిరువన్నామలైకి వెళుతుంటారు. అలా వెళ్తూ.. ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం పలువురిని కలచివేసింది.

Similar News