ఏడాది వయసున్న చెల్లిని కాల్చి చంపిన మూడేళ్ల అన్న..
కలోని గన్ కల్చర్ అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలు తీస్తోంది.
ప్రమాదకర వస్తువులను పసివాళ్లకు దూరంగా ఉంచాలని పెద్దవాళ్లు ఊరికే అనలేదు.. ఆ చిన్నారికి అది తుపాకీ అని, అది పేలుతుందని తెలియదు.. ఆడుకునే వస్తువే అనుకున్నాడు.. అదాటున దాని మీద చేయి వేశాడు.. ఒక్కసారిగా తుపాకీ పేలింది. చిట్టి చెల్లి ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు.
అమెరికలోని గన్ కల్చర్ అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలు తీస్తోంది. అయినా అక్కడి చట్టాల్లో మార్పు రావట్లేదు. ఏడాది వయసున్న చెల్లితో ఆడుకుంటున్న మూడేళ్ల అన్న అక్కడే ఉన్న గన్ పట్టుకున్నాడు.. అది కాస్తా పేలి తోబుట్టువు ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఈ దురదృష్టకర సంఘటన అమెరికాలోని ఫాల్‌బ్రూక్ ప్రాంతంలో చోటు చేసుకుంది. సోమవారం నాడు లైసెన్స్ లేని తుపాకీని పట్టుకోవడంతో ఈ అనర్థం జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు, 3 ఏళ్ల చిన్నారి తుపాకీని పట్టుకున్నట్లు నిర్ధారించారు. ఏడాది వయసున్న చిన్నారి తలకు గాయమైనట్లు గుర్తించారు. బాధితురాలిని పాలోమర్ ఆసుపత్రికి తరలించగా, చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.