విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. బైక్‌మీద వచ్చి యువతిపై..
విశాఖలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదన్న కోపంతో యువతిపై దాడికి తెగబడ్డాడు.;
విశాఖలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదన్న కోపంతో యువతిపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన అనకాపల్లి మండలం తుమ్మల పాల గ్రామంలో చోటుచేసుకుంది. తుమ్మపాలకు చెందిన మైనర్ బాలికపై అదే ప్రాంతానికి చెందిన సందీప్ దాడిచేశాడు. ఉదయం యువతి ఒంటరిగా వాకింగ్ కు వెళ్లిన క్రమంలో.... సందీప్ బైక్‌మీద వెళ్లి దాడికి పాల్పడ్డాడు. ఉన్మాది సందీప్ పై యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.