Pushpa : 'పుష్ప'ని ఫాలో అయ్యాడు... అడ్డంగా బుక్కయ్యాడు..!
Pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెయిన్ లీడ్‌లో సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప..;
Pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెయిన్ లీడ్‌లో సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ స్మగ్లర్‌గా కనిపించాడు. సినిమాలో పోలీసులకి దొరకకుండా ఎర్రచందనాన్ని చెక్ పోస్ట్ దాటిస్తుంటాడు పుష్ప.. అయితే సినిమాలో అల్లు అర్జున్‌ని ఇన్‌స్పైర్‌గా తీసుకొని కోట్లు విలువ చేసే ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు ఓ వ్యక్తి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అతని పేరు యాసిన్ ఇనయాతుల్లా.. ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కర్ణాటక-ఆంధ్ర సరిహద్దు ప్రాంతం నుంచి మహారాష్ట్రకు వెళ్లే క్రమంలో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నం చేశాడు. పోలీసులకి అనుమానం రాకుండా ఎర్రచందనం దుంగల్ని పెట్టి.. దానిపైన పండ్లు, కూరగాయాల డబ్బాలను ఉంచాడు. దీనికి తోడు ట్రక్కుకు 'కొవిడ్ - 19, నిత్యావసర ఉత్పత్తులు' అని స్టిక్కర్ కూడా అతికించాడు.
అలా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని చెక్ పోస్టులను దాటుకొని మహారాష్ట్రకి చేరుకున్నాడు, కానీ సంగ్లీ జిల్లాలోని గాంధీ చౌక్ వద్దకు రాగానే అక్కడి పోలీసులు ట్రక్కును ఆపేసి చెక్ చేయగా మనోడి బాగోతం బయటపడింది. దీనితో వెంటంటే అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు పోలీసులు.. అతని నుంచి ట్రక్కుతో పాటుగా ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా దీనివిలువ రూ.2.45 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.