Mangalagiri: తనకంటే భర్తే పిల్లలను బాగా చూసుకుంటున్నాడంటూ భార్య ఆత్మహత్య..
Mangalagiri: మంగళగిరిలో రత్నాల చెరువుకు చెందిన ఎలమద్ది విమల అనే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.;
Mangalagiri: మంగళగిరిలో రత్నాల చెరువుకు చెందిన ఎలమద్ది విమల అనే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో రికార్డు చేసింది విమల. ఇందులో తన ఆత్మహత్యకు గల కారణాలను వివరించింది. తన భర్తలాగా తానూ పిల్లలను చూసుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. వచ్చే జన్మలోనూ తనకే భార్యగా పుట్టాలని ఉందంటూ వీడియోలో చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు..ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.