Mahabubabad District : నిండు గర్భిణీ పై కరోనా కాటు...!
Mahabubabad District : కరోనా మహమ్మారి నిండు గర్భిణిని కబళించింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సొమ్లాతండలో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.;
Mahabubabad District : కరోనా మహమ్మారి నిండు గర్భిణిని కబళించింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సొమ్లాతండలో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన భూక్యా శిల్పకి ఈ నెల 8న కరోనాతో సొకగా, లక్షణాలు అధికం కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శిల్ప మృతి చెందింది. శిల్ప మృతి చెందిన వెంటనే అప్రమత్తమైన వైద్యులు ఆపరేషన్ చేసి ఆమె కడుపులోని బిడ్డను కాపాడే ప్రయత్నం చేస్తారు. అయితే అప్పటికీ ఆ పసిగుడ్డు కూడా మృతి చెందింది తల్లి, బిడ్డ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి పంచాయతీ సిబ్బంది సహకారంతో తల్లీబిడ్డల అంత్యక్రియలు నిర్వహించారు.