Bahadurpura Suicide: వదిలేసి వెళ్తున్నా.. క్షమించండి..
Bahadurpura Suicide: హైదరాబాద్ బహదూర్‌పురలో విషాదం చోటుచేసుకుంది.;
Bahadurpura Suicide (tv5news.in)
Bahadurpura Suicide: హైదరాబాద్ బహదూర్‌పురలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి వారం రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. ఆ విషయం ఇంట్లో చెప్తే భయపడతారని మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఉరివేసుకొని పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్పాట్‌లో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అమ్మానాన్న నన్ను క్షమించండి.. నేను మిమ్మల్ని వదిలి వెళుతున్నాను.. నన్ను మర్చిపోండి.. నా ఫోన్ అమ్మి అంత్యక్రియలు నిర్వహించాలని.. అప్పుడే నా ఆత్మకు శాంతి జరుగుతుందంటూ సూసైడ్ నోడ్‌లో పేర్కొన్నాడు.