HYD Kidnap : ప్రియుడిపై మోజుతో భర్తను కిడ్నాప్ చేయించిన భార్య..!
HYD Kidnap : ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ.... విడాకుల కోసం ఏకంగా భర్తనే కిడ్నాప్ చేయించింది. ఈ ఘటన సికింద్రాబాద్‌లో చోటు చేసుకుంది.;
HYD Kidnap : ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ.... విడాకుల కోసం ఏకంగా భర్తనే కిడ్నాప్ చేయించింది. ఈ ఘటన సికింద్రాబాద్‌లో చోటు చేసుకుంది. మోండా మార్కెట్‌లోని ఓ చెప్పులు దుకాణంలో పని చేస్తున్న ఆప్షియా బేగం.... ప్రియుడు ఆసీప్ మోజులో పడి విడాకుల కోసం భర్త షేక్ వాజిత్‌తో తరచు గొడవ పడేది. వీళ్లకు ముగ్గురు పిల్లలు కూడా ఉండటంతో... వాజిత్ విడాకులు ఇచ్చేందుకు అంగీకరించలేదు. దీంతో ఆసీప్.. అతని స్నేహితులతో కలిసి షేక్ వాజిత్‌ను కిడ్నాప్ చేయించి... బలవంతంగా విడాకుల పత్రాలపై సంతకం చేయించుకుంది. బాధితుడు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో... నిందితులను అరెస్ట్ చేశారు.