Yadadri Bhuvanagiri: చౌటుప్పల్‌లో దారుణం.. మహిళపై అత్యాచారం.. ఆపై దారుణంగా హత్య..
Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుప్రాన్‌పేటలో దారుణమైన ఘటన జరిగింది.;
Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుప్రాన్‌పేటలో దారుణమైన ఘటన జరిగింది. ఓ మహిళపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. సెక్యురిటీ గార్డ్‌గా చేస్తున్న భర్త డ్యూటీకి వెళ్లిన సమయంలో.. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేసి అత్యాచారం ఆపై హత్య చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. తలపై బలంగా కర్రతో కొట్టడంతో ఆమె స్పాట్‌లోనే చనిపోయిందంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కోడూరు మండలం కర్రెన్నబండ తండాకు చెందిన కృష్ణ నాయక్, లావణ్య కొన్నాళ్ల కిందట వలస వచ్చారు. తూప్రాన్‌పేటలో సెక్యూరిటీగా గార్డుగా పనిచేస్తున్న భర్త విధులకు వెళ్లిన టైమ్‌లో.. ఆమెపై దాడి చేసి, అత్యాచారం చేసి చంపేశారు.