Vijayawada : మార్పింగ్ చేసిన ఫోటోలు సోషల్‌మీడియాలో .. ఆత్మహత్యకు పాల్పడిన యువతి
Vijayawada : విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడడం కలకలంరేపింది.;
Vijayawada : విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడడం కలకలంరేపింది. మార్పింగ్ చేసి సోషల్‌మీడియాలో పెట్టిన తన ఫోటోలపై ఫిర్యాదు చేసినా, పోలీసులు పట్టించుకోవడంలేదంటూ అబిదా అనే యువతి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. అబిదాకు సోషల్ మీడియాలో సులేమాన్‌తో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అతను పెళ్లికి నిరాకరించడంతో అబిదాకు ఆమె తల్లిదండ్రులు ఇటీవల పెళ్లి చేశారు. ఈ విషయం తెలుసుకున్న సులేమాన్. అతని స్నేహితుడు ఖురేషీ సహాయంతో మార్పింగ్ చేసిన అబిదా ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. దీంతో మనస్థాపం చేసిన అబిదా... పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. . దీన్ని గమనించిన స్థానికులు, పోలీసులు.. అబిదాను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.