Banjara Hills Drugs Case: ఫుడింగ్ పబ్ కేసులో నిందితులకు రిమాండ్.. ఇద్దరు పరారీ..
Banjara Hills Drugs Case: బంజారాహిల్స్‌లోని ఫుడింగ్ పబ్ కేసులో నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు;
Banjara Hills Drugs Case: బంజారాహిల్స్‌లోని ఫుడింగ్ పబ్ కేసులో నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. అనిల్, అభిషేక్ ఉప్పలను రిమాండ్‌కి తరలించారు. డ్రగ్స్ కేసులో అనిల్, అభిషేక్‌తో పాటు మరో ఇద్దరి పేర్లు చేర్చారు. పరారీలో ఉన్న కిరణ్‌రాజ్, అర్జున్ వీరమాచినేని కోసం గాలింపు వేగవంతం చేశారు పోలీసులు. తనిఖీల సందర్భంగా పబ్‌లో డ్రగ్స్ గుర్తించిన పోలీసులు.. వాటి సరఫరా ఎప్పటి నుంచి జరుగుతుంది? ఎవరు తీసుకొస్తున్నారు? ఏజెంట్లను నియమించుకున్నారా? అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో A1గా పబ్ మేనేజర్ అనిల్ పేరు చేర్చారు. A2గా అభిషేక్ ఉప్పల ఉంటే, A3గా అర్జున్ వీరమాచినేని, A4గా కిరణ్‌రాజ్ పేర్లను FIRలో నమోదు చేశారు.