యాసిడ్ దాడి బాధితురాలు..తిరిగిరాని లోకాలకు..
ఏలూరు యాసిడ్ దాడి బాధితురాలు చనిపోయింది. మణిపాల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఫ్రాన్సిక మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు.;
ఏలూరు యాసిడ్ దాడి బాధితురాలు చనిపోయింది. మణిపాల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఫ్రాన్సిక మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు.ఆమె మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్ కి తరలించారు పోలీసులు.పోస్టుమార్టం తరువాత కుటుంబ సభ్యులకు డెడ్‌బాడీని అప్పగించారు. ఈనెల 13న ఏలూరులో ఫ్రాన్సికపై యాసిడ్ దాడి జరిగింది.విధులకు వెళ్లివస్తుండగా ఆమెపై యాసిడ్‌తో దాడి చేసి పరారైయ్యారు దుండగులు.తీవ్ర గాయాలతో ఫ్రానిక ఆస్పత్రిలో చికిత్సపొందుతూ అర్ధరాత్రి చనిపోయింది.రాజకీయ ఆందోళనల నేపథ్యంలో అలెర్ట్ అయిన పోలీసులు భారీగా మోహరించారు.