ఏపీ దండుపాళ్యం బ్యాచ్‌గా పేరున్న ముఠా అరెస్ట్..!
చక్రవర్తి, గోపిరాజు, ప్రభుకుమార్ అనే యువకులు.. గత రెండేళ్లలో ఐదు హత్యలు చేసి, పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్నారు.;
ఏపీ దండుపాళ్యం బ్యాచ్‌గా పేరున్న ముఠాను బెజవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. చక్రవర్తి, గోపిరాజు, ప్రభుకుమార్ అనే యువకులు.. గత రెండేళ్లలో ఐదు హత్యలు చేసి, పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్నారు. వీరిపై హత్యలతో పాటు 10 చైన్ స్నాచింగ్ కేసులు, మరో ఐదు చోరీ కేసులు కూడా ఉన్నాయి. బెజవాడలో ఏటీఎం చోరీ చేస్తుండగా ముఠాలోని ముగ్గురినీ పట్టుకున్నారు పోలీసులు. ఒంటరి మహిళలు, వృద్ధులే టార్గెట్‌గా ఈ ముఠా నేరాలు చేస్తుంటారని పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు యువకులు జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు, హత్యలు చేస్తున్నారని విచారణలో తేలింది. మరో ముగ్గురి చంపేందుకు ఈ బ్యాచ్ స్కెచ్ వేసినట్టు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.