Crime : నల్గొండ జిల్లాలో దారుణం.. మాజీ భార్య, ప్రియుడిపై కత్తితో భర్త దాడి..

Update: 2025-07-31 06:45 GMT

వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి. దాడులు, హత్యలకు దారితీస్తున్నాయి. దీంతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్న అవుతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య, ప్రియుడిపై.. భర్త కత్తులతో దాడి చేశాడు. వరంగల్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన రవి, లావణ్యలకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన రవి ఫ్రెండ్ శంకర్‌తో లావణ్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో కుటుంబంలో గొడవలు తీవ్రమయ్యాయి. వివాహేతర సంబంధం మానుకోవాలంటూ భార్యను హెచ్చరించాడు. మూడేళ్ల క్రితం తల్లి గారి ఇంటికి అని చెప్పి పిల్లలతో వెళ్ళిన లావణ్య భర్త రవిని వదిలేసింది.

అటు రవి సైతం 8 నెలల క్రితం రవి కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం లావణ్య.. పిల్లలతో కలిసి యాదాద్రి జిల్లా భువనగిరి మండలం రాయగిరికి మకాం మార్చింది. ఇక్కడే ప్రియుడు శంకర్‌తో సహజీవనం సాగిస్తోంది. ఇదే సమయంలో రవి పెద్ద కూతురు ఇన్‌స్టా గ్రామ్ లో ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఫోటో లొకేషన్ ఆధారంగా లావణ్య రాయగిరిలో ఉన్నట్లు రవి గుర్తించాడు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లి తన మాజీ భార్య, అతడి ప్రియుడిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడి నుంచి శంకర్ తప్పించుకోగా.. లావణ్యకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రవిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Tags:    

Similar News