Bhadrachalam Temple EO : భద్రాచలం ఆలయ ఈవో పై దాడి... భూముల ఆక్రమనే కారణమా..??
ఆలయ భూముల ఆక్రమణను అడ్డుకున్న పాపానికి ఈవో పై దాడి చేశారు కొందరు గ్రామస్థులు.. తెలంగాణ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం లో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంద. భద్రచలం ఆలయ ఈవో రమాదేవిపై పురుషోత్తమపట్నం గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. అయితే, ఆలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, ఆక్రమణలు అడ్డుకున్న పాపానికి ఆమెపై మూకుమ్మడిగా దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, విషయం తెలుసుకున్న ఆలయ సిబ్బంది పురుషోత్తమపట్నంకు వెళ్లగా.. ఇరు పక్షాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అయితే, ముగ్గురు మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు ఉన్న ఉమ్మడి జిల్లాల్లో ఓ ప్రభుత్వ ఉద్యోగిపై దాడి జరగడం సంచలనంగా మారింది.
పురుషోత్తపట్నంలో భద్రాద్రి రామాలయానికి 889.50 ఎకరాల భూమి ఉంది. భూములను దేవస్థానానికి అప్పగించాలని ఇప్పటికే ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను బేఖాతరు చేసి ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన ఈవోపై దాడి చేశారు. ఈ దాడితో రమాదేవి స్పృహ కోల్పోయారు. ఆమెను భద్రాచలం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.