Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య.. క్యాంపస్‌లో ఆందోళనలు..
Basara IIIT: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.;
Basara IIIT: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.. ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యతో విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. క్యాంపస్‌లో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు.. బందోబస్తుకు వచ్చిన సీఐ వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతున్న సురేష్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.. హాస్టల్ రూమ్‌లో ఉరివేసుకుని సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు..
అయితే, విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు.. పోలీసులు విచారణ జరుపుతున్నారు. విద్యార్థి చనిపోతే వర్సిటీ యాజమాన్యం నుంచి కనీస స్పందన కూడా లేదని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచలేదని ఫైరయ్యారు.. పోలీసుల వాహనాన్ని ధ్వంసం చేశారు.. యాజమాన్యం ఆంక్షలు పెట్టడం తప్ప విద్యార్థుల బాగోగులు చూసుకోవడం లేదని మండిపడ్డారు.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు.