పల్నాడు జిల్లా,నరసరావుపేట తండ్రి,కొడుకుల హత్యకేసులో పోలీసులు ఇప్పటికే పోలీసులు పలు ఆధారాలను సేకరించినట్లు తెలుస్తుంది.నిన్న ఉదయం చెక్ బౌన్స్ కేసులో కోర్టు హాజరైయ్యేందుకు బెంగుళూరు నుండు వచ్చిన కొడుకు ప్రశాంత్ రెడ్డి,తండ్రి వీరస్వామి రెడ్డి ని ప్రత్యర్ధులు అతి కిరాతకంగా పట్టపగలే బలవంతంగా కారులోకి ఎక్కించుకుని కిడ్నాప్ చేసి ఆ తరువాత హత్య చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం లేపింది.
తండ్రి,కొడుకులను TG 08 k 2345 స్కార్పియో కారులో బలవంతంగా లాక్కెళ్లి కిడ్నప్ చేసిన దృశ్యాలు సిసి టీవీ ఫుటేజ్ లో కంటపడ్డాయి.ఈ నేపధ్యంలోనే కొంత కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది హత్య చేసిన ప్రధాన నిందితులలో ఒకరైన బాదం మాధవ రెడ్డి కిడ్నప్ చేసే సమయంలో కార్ ఎక్కుతూన దృశ్యాలు బయటకు వచ్చాయి.బాదం మాధవ్ రెడ్డి గతంలో 2014 నుండి 2017 వరకు ప్రకాశం జిల్లా,దర్శి నియోజకవర్గానికి వైసీపీ ఇంచార్జ్ గా కూడా ఉన్నారు.తరువాత పరిస్థితులు దృష్ట్యా టీడీపీ లోకి వెళ్లారు. ఇప్పుడు బాదం మాధవ్ రెడ్డి నేరుగా కిడ్నప్ చేసి హత్య చేసిన సమయంలో కారులో ఉండడం ఇప్పుడు హత్య జరిగిన కోణం పూర్తిగా మారిపోతుంది.
హత్యకు గురైన ప్రశాంత్ రెడ్డి,వీర స్వామి రెడ్డిలకు బాదం మాధవ్ రెడ్డి అత్యంత ఆప్తుడు,దూరపు బంధువులు కూడా. గత కొన్నేళ్ల క్రితం ప్రశాంత్ రెడ్డి,వీరా స్వామి రెడ్డి లు వ్యాపారం నిమిత్తం సంతమాగులూరు నుండి బెంగుళూరులో స్థిరపడ్డారు.బాదం మాధవ్ రెడ్డి ఎదుగుదలకు కూడా ప్రశాంత్ రెడ్డి వెన్నుదన్నలు ఉండేవని సమాచారం. అలాంటిది మాధవ్ రెడ్డి నేరుగా ఘటనలో పాల్గొని మరి హత్య చేశాడనేదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది.పోలీసులు అన్ని కోణాల్లో పూర్తి దర్యాప్తు చేసే క్రమంలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే హత్యలో పాల్గొన్న సుమారు ఆరుగురి వివరాలు సేకరించి.నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.