కాంగోలో ఘోర బోటు ప్రమాదం జరిగింది. కివు లేక్‌లో 278 మంది ప్రయాణికులతో వెళుతున్న పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో 78 మంది మృతిచెందారు. వంది మందికి పైగా గల్లంతయ్యారు. ఇప్పటికే 50మంది మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక ప్రావిన్స్ గవర్నర్ తెలిపారు. ఓవర్ లోడింగ్ కారణంగా కిటుకు పోర్టుకు కొన్ని మీటర్ల సమీపంలో డాక్ చేయడానికి ప్రయత్నిస్తుండగా పడవ మునిగిపోయినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. ఓవర్ లోడింగుతో ప్రయాణికులను తరలించే పడవలు తరచూ ప్రమాదాలకు గురవటం ఈ ప్రాంతంలో సాధారణంగా మారింది