Indigo Flight : ఇండిగో ఫ్లైట్ కు బాంబు బెదిరింపు

Update: 2024-09-02 10:00 GMT

ఇండిగోకు ఫైట్ కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ఆదివారం ఉదయం 7.55 గంటలకు ఇండిగో ఫ్లైట్ మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ కు బయలుదేరింది. 9గంటల ప్రాంతంలో ఓ ప్యాసింజర్ టాయిలెట్‌లోకి వెళ్లగా కమోడ్‌ సీటుపై ఓ పేపర్‌ కన్పించింది. దానిపై ‘బ్లాస్ట్‌’ అని రాసి ఉండటంతో వెంటనే సిబ్బందికి చెప్పారు. అప్రమత్తమైన పైలట్, విమాన సిబ్బంది ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు సమాచారమిచ్చారు. అనంతరం విమానాన్ని నాగ్‌పుర్‌కు మళ్లించారు.ఉదయం 9.20 గంటలకు విమానం నాగ్‌పుర్‌ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా దిగినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ముందు జాగ్రత్త చర్యగా ఎమర్జెన్సీ సిబ్బంది, అంబులెన్స్‌లను విమానాశ్రయంలో సిద్ధంగా ఉంచారు. ప్రయాణికులను దించి వారి లగేజీలను తనిఖీ చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు తెలిపారు. ఫ్లైట్ లో 69 మంది ప్యాసింజర్లను బస్సులో హైదరాబాద్ కు తరలించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News