Instagram Reels : ప్రాణం మీదకు తెచ్చిన రీల్స్ సరదా..

Instagram Reels : దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. అది క్రాస్ అయితే అంతే సంగతులు. ఇక్కడ కూడా అదే జరిగింది;

Update: 2022-09-04 11:00 GMT

Instagram Reels : దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. అది క్రాస్ అయితే అంతే సంగతులు. ఇక్కడ కూడా అదే జరిగింది. రీల్స్ సరదా యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. అజయ్‌ అనే యువకుడు రీల్స్‌ చేస్తుండగా ట్రైన్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. బలమైన గాయం అవడంతో అక్కడే కూలిపోయాడు. వరంగల్ జిల్లా వడ్డేపల్లి రైల్వే ట్రాక్ వద్ద ఈ ఘటన జరిగింది. షాక్‌ గురైన స్నేహితులు.. వెంటనే 108కు ఫోన్‌ చేసి అజయ్‌ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హాస్పిటల్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు బాధితుడు.

అజయ్.. వడ్డేపల్లిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. సండే కావడంతో రీల్స్ చేద్దామని ముగ్గురు స్నేహితులతో కలిసి రైల్వే ట్రాక్‌ వద్దకు వెళ్లాడు. ట్రైన్‌ వెనుక నుంచి వస్తుండగా స్లో మోషన్‌లో రీల్‌ చేయాలనేది వీళ్ల ప్లాన్. కానీ ప్లాన్ బెడిసి కొట్టింది. తీరా ట్రైన్‌ వచ్చి ఢీ కొట్టేంత వరకు అజయ్ గానీ, అతని ఫ్రెండ్స్‌ గానీ గుర్తించలేకపోయారు. ఫలితంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.

Tags:    

Similar News