ప్రియురాలిపై ప్రియుడి పాశవికం.. బుల్డోజర్ తో బుద్ది చెప్పిన అధికారులు

ప్రియురాలి నోరు మూసి అత్యాచారం చేసి, హింసించిన దుర్మార్గుడికి బుల్డోజర్ తో బుద్ది చెప్పారు.;

Update: 2024-05-14 06:23 GMT

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాకు చెందిన అయాన్ పఠాన్ అనే వ్యక్తి తన ప్రియురాలిపై పదే పదే అత్యాచారం చేసి, ఆమె కళ్లు, నోటితో పాటు ఆమె ప్రైవేట్ భాగాల్లో కూడా కారం పొడి పోశాడు. ఆ తర్వాత ఆమె కేకలు వేయకుండా ఆమె నోటిని ప్లాస్టిక్ టేప్ తో మూసేసాడు.

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో అధికారులు ఆదివారం అయాన్ పఠాన్‌కు చెందిన "చట్టవిరుద్ధంగా నిర్మించిన" ఇంటిని బుల్‌డోజర్‌ తో కూల్చేశారు. 

జిల్లా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పఠాన్ నకిలీ పత్రాలను ఉపయోగించి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్థలంలో ఇల్లు నిర్మించినట్లు కనుగొన్నారు. తరువాత దానిని కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. 

నిందితుడు అయాన్ పఠాన్ ప్రియురాలని నెల రోజుల పాటు బందీగా  ఉంచి, అత్యాచారం చేసి, హింసించాడని ఆరోపించారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు బాధితురాలు కొంతకాలంగా సంబంధం కలిగి ఉన్నారని, ప్రియురాలి ఆస్తిని తన పేరు మీద బదిలీ చేయాలని ప్రియుడు పఠాన్ కోరుకున్నాడు. అయితే ఆమె నిరాకరించడంతో నిందితులు ఆమెను బందీగా ఉంచి కొట్టారు.

ఈ వారం ప్రారంభంలో మహిళకు జరిగిన ఘోరమైన దృశ్యాలు సోషల్ మీడియాలో రావడంతో ఈ అనాగరిక సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆసుపత్రిలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితురాలి ఫిర్యాదు మేరకు అయాన్‌ను అరెస్టు చేశారు.

నిందితుడి ఇంట్లో అక్రమ మద్యం దొరికినందున అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అత్యాచారం కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News