ఇంటికి పిలిచి బీకాం విద్యార్థినిపై అత్యాచారం..!
పెళ్లిపేరుతో ఓ యువతిని నమ్మించి అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.;
పెళ్లిపేరుతో ఓ యువతిని నమ్మించి అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రహమత్ నగర్‌కు చెందిన బీటెక్ విద్యార్ధి రాజు .. అదే ప్రాంతానికిచెందిన బీకాం చదువుతున్న విద్యార్ధినిని ప్రేమపేరుతో వంచించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి... ఇంటికి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డట్టు బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు రాజుపై చీటింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.