Bus Crash in Iraq : బస్సు బోల్తా.. 35 మంది పాక్ ప్యాసింజర్లు మృతి

Update: 2024-08-21 13:00 GMT

ఇరాక్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. పాకిస్తాన్ నుండి ఇరాక్‌కు షియా యాత్రికులను తీసుకువెళుతున్న బస్సు ఇరాన్‌లోని యాజ్ద్‌లో బోల్తా పడింది. ఈ ఘటనలో 35 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని రేడియో పాకిస్తాన్ నివేదించింది. బస్సులో 53 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది పాకిస్థాన్‌లోని దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లోని లర్కానా నగరానికి చెందినవారు.

సెంట్రల్ ఇరాన్ ప్రావిన్స్ యాజ్ద్‌లో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. 11 మంది మహిళలు, 17 మంది పురుషులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.

Tags:    

Similar News