Cab Driver kills Techie : డేంజర్ క్యాబ్ డ్రైవర్
Cab Driver kills Techie : క్యాబ్ డ్రైవర్ల ఆగడాలు నేరాలు క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. తాజాగా తమిళనాడు చెన్నైలో ఉమేంద్ర అనే సాఫ్ట్ వేర్ టికీని క్యాబ్ డ్రైవర్ కొట్టి హత్యచేశాడు.
Crime : క్యాబ్ డ్రైవర్ల ఆగడాలు నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా తమిళనాడు చెన్నైలో ఉమేంద్ర అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని క్యాబ్ డ్రైవర్ కొట్టి హత్యచేశాడు. ఓటీపీకి సంబంధించిన చిన్న విషయం ఇద్దరి మధ్య పెద్దగొడవకు దారి తీసింది.
కోయంబత్తూర్ లోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేసే ఉమేంద్ర కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయడానికి చెన్నై వచ్చాడు. సాయంత్రం 3 గంటల సమయంలో సినిమా చూసి ఇంటికి బయల్దేరారు. అతని భార్య క్యాబ్ బుక్ చేసింది.
ఉమేంద్ర అతని భార్యా పిల్లలు, భార్య సోదరి, ఆమె పిల్లలు కూడా ఉన్నారు. క్యాబ్ రాగానే ఉమేంద్ర పిల్లలతో కలిసి క్యాబ్ లో కూర్చున్నారు. ఓటీపీ చెప్పిన తరువాతే క్యాబ్ లోనికి రావాలని, బయటకు దిగమని అనడంతో ఉమేంద్రకు కోపం వచ్చి క్యాబ్ డోర్ గట్టిగా వేసాడు.
దీంతో డ్రైవర్ రవి.. విచక్షణా రహితంగా ఉమేంద్రను పిడిగుద్దులు గుద్దాడు. ఉమేంద్ర పిల్లలు కుటుంబసభ్యులు వారిస్తున్నా సరే డ్రైవర్ క్రూరంగా దాడి చేశాడు. స్పృహ కోల్పోయిన ఉమేంద్రను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు.
హంతకుడు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా స్థానికులు పట్టుకొని కెలంబాకం పోలీసులుకు అప్పగించారు. డ్రైవర్ రవిని అరెస్టు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.