ప్రకాశం జిల్లాలో బాలికపై వాలంటీర్ అత్యాచారం
బాలిక ఫోటోలు తీసి ఫేస్‌బుక్‌లో పెడతానంటూ బెదిరించి మూడు సార్లు అత్యాచారం చేశాడు;
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పెదకొత్తపల్లిలో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై వాలంటీర్ క్రాంతి అత్యాచారం చేశాడన్న ఫిర్యాదుపై కేసు నమోదైంది. తనను వాలంటీర్ క్రాంతి బెదిరించి లోబరుచుకున్నాడని.. బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
బాలిక ఫోటోలు తీసి ఫేస్‌బుక్‌లో పెడతానంటూ బెదిరించి మూడు సార్లు అత్యాచారం చేశాడు. తనపై జరుగుతున్న లైంగిక దాడులకు భయపడిపోయిన బాలిక.. తల్లికి చెప్పడంతో.. ఒంగోలులోని దిశ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
అయితే బాలికను విచారించిన పోలీసులు.. మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో వాలంటీర్ క్రాంతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.