Chandigarh: కాలేజీ నుంచి వస్తున్న ఇద్దరు అక్కచెల్లెళ్లు.. థార్ ఢీ కొనడంతో ఒకరు మృతి

సోజెఫ్, ఇషా అనే ఇద్దరు సోదరీమణులను వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. సోజెఫ్ మరణించగా, ఇషా తీవ్రంగా గాయపడింది.

Update: 2025-10-16 07:33 GMT

బుధవారం చండీగఢ్‌లోని సెక్టార్ 46లో వేగంగా వస్తున్న మహీంద్రా థార్ కారు ఇద్దరు అక్కాచెల్లెళ్లపైకి దూసుకెళ్లింది. దాంతో వారిలో ఒకరు మృతి చెందారు.

సోజెఫ్, ఇషా బురాలి ప్రాంతానికి చెందిన సోదరీమణులు దేవ్ సమాజ్ మహిళా కళాశాలలో చదువుతున్నారు. కాలేజీ నుంచి తిరిగి వస్తున్న వారిని వేగంగా వస్తున్న థార్ ఢీకొట్టింది. దాంతో సోజెఫ్ మరణించగా, ఇషా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 

డ్రైవర్ అక్కడి నుండి పారిపోయాడు

కళాశాల నుండి తిరిగి వస్తూ రోడ్డు పక్కన ఆటో రిక్షా కోసం ఎదురు చూస్తుండగా వేగంగా వస్తున్న థార్ కారు వారిని ఢీకొట్టింది. వెంటనే గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన వారిని ప్రభుత్వ వైద్య కళాశాల & ఆసుపత్రి (GMCH), సెక్టార్ 32కి తరలించారు. కానీ సోజెఫ్ అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. ఇషా చికిత్స పొందుతోంది.

సీసీటీవీ ద్వారా డ్రైవర్ కోసం వెతుకుతున్న పోలీసులు

థార్ రిజిస్ట్రేషన్ నంబర్ సహాయంతో నిందితుడు డ్రైవర్ వివరాలను పోలీసులు గుర్తించారు. పోలీసులు డ్రైవర్ ఇంటి చిరునామాను సెక్టార్ 21గా గుర్తించారు. అయితే, ఆ డ్రైవర్ ఇప్పుడు అక్కడ నివసించడం లేదని తెలుసుకున్నారు. డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

Tags:    

Similar News