CRIME: " నా బంగారు తల్లిని వచ్చే జన్మలో పెళ్లి చేసుకుంటా"

Update: 2025-09-09 04:30 GMT

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొర్విచల్మ గ్రామంలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఈ ఘోరానికి పాల్పడ్డారు. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న హితవర్షిణి ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియురాలి మరణవార్త విన్న ప్రియుడు వినయ్ బాబు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వినయ్ బాబు సూసైడ్ నోట్లో నా బంగారు తల్లిని వచ్చే జన్మలో అయినా పెళ్లి చేసుకుంటా అని రాశాడు. యువతి చివరిగా తన గ్రామానికి చెందిన వినయ్తో ఫోన్ మాట్లాడినట్లు గుర్తించారు. అతడిని విచారించేందుకు వెళ్లగా అతను కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా, వీరిద్దరు ప్రేమించుకున్నారని, పెద్దలు వీరి పెళ్లికి నిరాకరించడంతోనే ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు.

Tags:    

Similar News