Dalit woman gang rape: గడ్డికోసం పొలానికి వెళ్లిన మహిళపై కామాంధులు..
Dalit woman gang rape: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సమీపంలోని జెవార్ ప్రాంతంలో దళిత మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసు అధికారులు సోమవారం తెలిపారు.;
Dalit woman gang rape: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సమీపంలోని జెవార్ ప్రాంతంలో దళిత మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసు అధికారులు సోమవారం తెలిపారు. ఆదివారం ఉదయం జరిగిన సంఘటనలో నలుగురు నిందితులలో ఒకరిని గ్రామం వెలుపల అరెస్ట్ చేసినప్పటికీ, మిగిలిన నిందితులు పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ సంఘటన ఆదివారం ఉదయం 9.30 మరియు 10.30 గంటల మధ్య గ్రామానికి సమీపంలో ఉన్న పొలాల్లో జరిగిందని డిప్యూటీ పోలీసు కమిషనర్ వృందా చెప్పారు.
అత్యాచారానికి గురైన మహిళ గడ్డి కోయడానికి, బర్రెలను మేపడానికి వెళ్లింది. మహిళను పొలాల్లోకి లాగి, ఆమెపై అత్యాచారం చేశారు. ఆమె సహకరించట్లేదని తుపాకీతో బెదిరించి మరీ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు.
ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అత్యాచార బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించగా ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని శుక్లా తెలిపారు. మహిళ భర్త ఫిర్యాదు మేరకు చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.