DOVAL: ఇండియన్ జేమ్స్ బాండ్ దోవల్కే ఉగ్రవాది బెదిరింపు
నీ కోసం నేను వెయిట్ చేస్తుంటా అని పన్ను బెదిరింపు
ఖలిస్తానీ ఉగ్రవాది ఇందర్జీత్ సింగ్ గోసల్‌కు కెనడాలో బెయిల్ లభించింది. అక్రమ ఫైర్ ఆర్మ్స్ కలిగి ఉన్న కేసులో ఇటీవలే అతను అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గోసల్ విడుదలయ్యాక.. నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) బహిరంగంగానే భారత జతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు బెదిరింపులు పంపింది. ఎస్ఎఫ్జేకు చెందిన మరో కీలక ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నున్.. ఇక వీడియో మెసేజ్‌లో దోవల్‌కు సవాల్ విసిరారు. ‘అజిత్ దోవల్.. నువ్వు కెనడాకో, అమెరికాకో లేదంటే ఏదైనా యూరోపియన్ దేశానికో వచ్చి ఎవర్నయినా అరెస్టు చెయ్. లేదంటే కనీసం ఎక్స్ట్రాడిషన్ చెయ్యడానికి ప్రయత్నించు. నీ కోసం నేను వెయిట్ చేస్తుంటా’ అని పన్నున్ హెచ్చరించాడు. ఆ వీడియోలో జైలు నుంచి బయటకొస్తున్న గోసల్ కూడా కనిపించాడు. ‘ఇండియా.. నేను బయటకొచ్చా. గురపత్వంత్ సింగ్ పన్నున్‌కు సపోర్ట్ చెయ్యడానికి, నవంబరు 23న ఖలిస్తాన్ రెఫరెండంను నిర్వహించడానికి వస్తున్నా’ అన్నాడు. ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిక్కూస్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు సంబంధించిన కొన్ని విషయాలను ఎన్ఐఏ వెల్లడించింది. అతడు భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా విభజించి, ఎన్నో దేశాలు ఏర్పాటు చేయాలని భారీ కుట్ర పన్నినట్టు ఓ నివేదిక తెలిపింది.