DRUGS: స్కూల్ ముసుగులో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ
సికింద్రాబాద్‌లో సంచలన ఘటన... స్కూల్ లోపలే మత్తుమందు తయారీ.. స్కూల్ మూసేసి డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ...అదే స్కూల్లో సాయంత్రం ట్యూషన్లు
హైదరాబాద్ లో ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది. సికింద్రాబాద్ లో మత్తుమందు తయారీ ఫ్యాక్టరీ గుట్టురట్టు చేసింది. పాత స్కూల్ లో ల్యాబ్ ను ఏర్పాటు చేసుకొని అల్ఫాజోలం తయారు చేస్తున్న చేస్తోంది. పెద్ద ఎత్తున రియాక్టర్లు పెట్టి మత్తు మందు తయారీ చేస్తున్నారు. తయారు చేసిన మత్తు మందును తీసుకెళ్తుండగా ఈగల్ టీం పట్టుకుంది. ప్రస్తుతం నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కోటికి పైగా అల్ఫా జోలం సీజ్ చేశారు. ఈగల్ టాస్క్ ఫోర్స్ టీం అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ డ్రగ్స్ దందాలో ఓ స్కూల్ డైరెక్టర్ ఈ కేసులో ఉన్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం సంగారెడ్డిలో ఓ అల్ఫా జోలం తయారీ కేంద్రంపై తనిఖీలు చేసిన ఈగల్ అధికారులు.. 50 లక్షల విలువచేసే ఆల్ఫా జోలం సీజ్ చేశారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. సెప్టెంబర్ 13న బోయిన్ పల్లిలో అల్ఫాజూలం కేంద్రంపై సోదాలు చేస్తున్నారు ఈగల్ టాస్క్ ఫోర్స్ అధికారులు.
అల్ఫాజోలం మత్తుమందు
ప్రమాదకరమైన ఆల్ఫా జోలం అనే మత్తుమందును స్కూల్లో తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మత్తుమందును నగరంలోని కల్లు కాంపౌండ్లకు, అలాగే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడుకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. స్కూల్లోని మూడు అంతస్తుల్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి, నాలుగు రియాక్టర్ల సహాయంతో ఆల్ఫా జోలం తయారీ కొనసాగించారని అధికారులు తెలిపారు. ఇప్పటికే అక్కడి నుంచి 20 లక్షల రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందుకున్న ఈగల్ టీం ముందుగా గౌడ్ దగ్గర రెడ్ హ్యాండెడ్‌గా 5 కిలోల ఆల్ఫా జోలం మత్తుమందు స్వాధీనం చేసింది. అనంతరం స్కూల్ లోపల నిర్వహించిన సోదాల్లో మరో 5 కిలోల ఆల్ఫా జోలం, నాలుగు రియాక్టర్లు, పలు రసాయనాలు, నగదు, తయారీకి సంబంధించిన పరికరాలు దొరికాయి. ఇటీవల సెప్టెంబర్ 6న మేడ్చల్ జిల్లా చర్లపల్లిలో భారీ డ్రగ్స్ తయారీ యూనిట్ ను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు గుట్టు రట్టు చేసిన సంగతి తెలిసిందే.. ఫార్మా కంపెనీల ముసుగులో అతి ప్రమాదకర మెఫెడ్రోన్, మోలీ, ఎక్స్టసీ లాంటి డ్రగ్స్‌ను సప్లయ్ చేస్తున్న రెండు కంపెనీలపై ముంబై క్రైమ్ డిటెక్షన్ యూనిట్ పోలీసులు దాడులు చేశారు. నెల రోజులుగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్‌లో చర్లపల్లిలో పట్టుబడిన ఇద్దరుసహా మొత్తం13 మందిని అదుపులోకి తీసుకున్నారు.