Medak: మెదక్‌లో ఇంటర్ విద్యార్థిని కేసులో ట్విస్ట్.. ఇది ఆత్మహత్య కాదు.. హత్య!
Medak: ఫోన్ కొనివ్వలేదని రామాయంపేట మండలం కోనాపూర్ ఊర చెరువులో దూకి శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు తొలిత భావించారు.;
Medak: మెదక్ జిల్లాలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఫోన్ కొనివ్వలేదని రామాయంపేట మండలం కోనాపూర్ ఊర చెరువులో దూకి శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు తొలిత భావించారు.. అయితే శ్రావణి తండ్రి మల్లేశం సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తన కూతురుని అత్యాచారం చేసి హత్య చేశారని మల్లేశం అంటున్నారు. తన కూతుర్ని నగ్నంగా ఫోటోలు తీసి.. ఇద్దరు వ్యక్తులు బెదిరిస్తున్నారని వాళ్లే ఆమెను దారుణంగా చంపేశారంటూ ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.