హన్మకొండ గోపాల్ పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. తన కూతురుతో చనువుగా ఉన్న భరత్ అనే యువకుడిపై బాలిక తండ్రి దాడి చేసి గొంతు కోశాడు. తండ్రి చేసిన దారుణాన్ని తట్టుకోలేక బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇటు భరత్ పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.