Guntur : మహిళా ఎస్సై, కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం..!
గుంటూరు జిల్లాలోని చుండూరు పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ శ్రావణి, అదే పొలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ పనిచేస్తున్న రవీంద్ర ఆత్మహత్యయత్నం చేయడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.;
గుంటూరు జిల్లాలోని చుండూరు పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ శ్రావణి, అదే పొలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ పనిచేస్తున్న రవీంద్ర ఆత్మహత్యయత్నం చేయడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం శ్రావణి గత ఏడాది అక్టోబరులో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు. అటు రవీంద్ర అయిదేళ్ల నుంచి ఇక్కడే కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారని తెలిసింది. అయితే ఇంతలో ఏమైందో తెలియదు కానీ వీరు ఆత్మహత్యాయత్నం చేశారు. దీనిపైన స్పందించిన చుండూరు సీఐ రమేష్‌బాబు..శనివారం గడ్డిమందు సేవించి తరవాత వారే తెనాలి ఆసుపత్రిలో చేరారని పేర్కొన్నారు. మెరుగైన చికిత్స కోసం వారిని గుంటూరుకి తరలించినట్లుగా చెప్పారు. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారని, సాధారణ స్థితిలోకి వచ్చిన తరవాత సరైనా సమాధానాలు ఇస్తామని అన్నారు.