Nizamabad Family Suicide: నిజామాబాద్ ఫ్యామిలీ సూసైడ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి..

Nizamabad Family Suicide: నిజామాబాద్ ఫ్యామిలీ సూసైడ్ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి.;

Update: 2022-01-09 11:09 GMT

Nizamabad Family Suicide: నిజామాబాద్ ఫ్యామిలీ సూసైడ్ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఫైనాన్షియర్ల వేధింపులు తట్టుకోలేకో కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు పప్పుల సురేష్ రాసిన సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్లాట్ వేలం వేయడంతో పాటు అప్పులు తీర్చాలంటూ ఫైనాన్షియర్లు చేసిన ఒత్తిడి తట్టుకోలేకే సూసైడ్ చేసుకున్నట్లు సెల్ఫీ వీడియోలో చెప్పాడు సురేష్. సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోను పరిశీలిస్తున్నారు పోలీసులు.

నిజామాబాద్ కు చెందిన పప్పుల సురేష్ కుటుంబం..శనివారం విజయవాడలో బలవన్మరణానికి పాల్పడింది. మొత్తం నలుగురు కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడలోని వాసవీ కన్యాక పరమేశ్వరీ సత్రంలో తల్లి శ్రీలత, చిన్న కుమారుడు ఆశిష్ చనిపోయారు. ఇక పెద్ద కొడుకు అఖిల్, తంజ్రి సురేష్ ప్రకాశం బ్యారేజిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

Tags:    

Similar News