రాహుల్ హత్యకేసులో మరో నలుగురు అరెస్ట్ ..!
బెజవాడలో పారిశ్రామిక వేత్త కరణం రాహుల్ హత్య కేసు... డైలీ సిరియల్‌ను తలపిస్తోంది. ఇవాళ మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.;
బెజవాడలో పారిశ్రామిక వేత్త కరణం రాహుల్ హత్య కేసు... డైలీ సిరియల్‌ను తలపిస్తోంది. ఇవాళ మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనగల శ్రీనాధ్, దేశెట్టి బాబురావు, ముళ్లపూడి రాజబాబు, రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. శనగల శ్రీనాథ్.... ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కోరాడ విజయ్ సమీప బంధువుగా పోలీసులు గుర్తించారు. అలాగే కోగంటి సత్యం ప్రధాన అనుచరుడిగా ఉన్న బాబురావును, కోరాడ విజయ్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్న రాజబాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ హత్య కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేయగా... ఇవాళ మరో నలుగుర్ని అరెస్ట్ చేయడంతో నిందితుల సంఖ్య 15కి చేరింది. మరికొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కోరాడ విజయ్‌కు చెందిన చిట్‌ఫండ్ ఆఫీసును, కోగంటి సత్యంకు చెందిన దుర్గ కళామందిర్ థియేటర్‌ను పోలీసులు సీజ్ చేశారు.