Visakhapatnam: 900 కేజీల గంజాయి.. కనీసం రూ. కోటి విలువ..
Visakhapatnam: విశాఖ నక్కలపల్లి టోల్‌గేట్ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది.;
Visakhapatnam: విశాఖ నక్కలపల్లి టోల్‌గేట్ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. తమిళనాడుకు ఐషేర్‌వాన్‌లో వాన్‌లో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను అధికారులు పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. నిందితుల నుంచి 23 బ్యాగుల్లోని 900 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమిళనాడుకు చెందిన బాలసుబ్రహ్మణ్యం, అనకాపల్లికి చెందిన నీలగిరి మణికుమార్, తిమ్మపాత్రునిగా గుర్తించారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు కోటిరూపాయలు ఉంటుందని అంచనావేస్తున్నారు.