Hyderabad: హైదరాబాద్‌లో యువతి ఆత్మహత్య కలకలం.. హుస్సేన్ సాగర్‌లో దూకి సూసైడ్..
Hyderabad: హైదరాబాద్‌లో ఓ యువతి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ట్యాంక్‌బండ్ పైనుంచి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది;
Hyderabad: హైదరాబాద్‌లో ఓ యువతి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ట్యాంక్‌బండ్ పైనుంచి హుస్సేన్ సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతదేహాన్ని హుస్సేన్‌సాగర్ నుండి బయటకు తీసిన లేక్ పోలీసులు పోస్ట్‌మార్టం కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న రాంగోపాల్‌పేట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సూసైడ్ చేసుకున్న యువతి ఎవరనేది తెలియదని అన్నారు. యువతి ఎవరు? ఎందుకు ఆత్యహత్యకు పాల్పడింది? అనేది తెలియాల్సి ఉందన్నారు. ఎవరికైనా తెలిస్తే రాంగోపాల్‌పేట్ పోలీసులకు తెలపాలని హుస్సేన్‌సాగర్ లేక్ పోలీసులు స్పష్టంచేశారు.