Tamil Nadu: ఉరివేసుకొని 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య.. నోట్‌బుక్‌లో ప్రేమకథ..
Tamil Nadu: శవాన్ని పోస్టుమార్టం కోసం పంపించిన తర్వాత పోలీసులు అమ్మాయి నోట్‌బుక్స్‌నను పరిశీలించారు.;
Tamil Nadu: ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు అంటుంటారు. కానీ అప్పుడప్పుడు ఆ ప్రేమే మనుషులను విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. పట్టరాని కోపంతో క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్న ఎంతోమంది జీవితాల్లో కీలక పాత్ర పోషించింది ఈ ప్రేమే. తాజాగా ఓ పదో తరగతి చదివుతున్న అమ్మాయి కూడా ప్రేమ కారణంగానే ప్రాణం తీసుకుంది. తన నోట్‌బుక్స్‌ను పరిశీలించిన తర్వాత అసలు విషయం బయటపడింది.
తమిళనాడులోని మదురవాయిల్‌కు చెందిన 15 ఏళ్ల అమ్మాయి కోయంబేడులోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతోంది. శనివారం రాత్రి తాను ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు మదురవాయిల్ పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. శవాన్ని పోస్టుమార్టం కోసం పంపించిన తర్వాత పోలీసులు అమ్మాయి నోట్‌బుక్స్‌నను పరిశీలించారు.
ఆ బాలిక నోట్‌బుక్స్‌లో తాను ఒక అబ్బాయిని ప్రేమించినానని.. కానీ ఆ అబ్బాయి మాత్రం వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని రాసింది. అంతే కాకుండా ఆ యువకుడు తనను మోసం చేశాడు కాబట్టే ఆత్మహత్య చేసుకుంటున్నానని స్పష్టం చేసింది. పరారీలో ఉన్న యువకుడిపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.